ప్రభుత్వ లెక్కల ప్రకారం విజయనగరంజిల్లాలో 9 వేల 300 చెరువులున్నాయి. గతంలో వీటి ద్వారా సాగు, తాగు నీరు లభించేది. గ్రామస్థులకు సేదతీరేందుకు ఇవి మంచి కేంద్రాలుగా విలసిల్లేవి. రానురాను... ఈ చెరువుల రూపురేఖలు మారిపోయి. సంరక్షణ కొరవడి.. సమస్యలు అధికమవుతున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్... చెరువుల శుద్ధికి సంకల్పించారు.
ప్రజాచైతన్యంతో స్వచ్ఛ చెరువుల కార్యక్రమానికి కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో అమలు చేయాలని ప్రణాళికలు వేశారు. కలెక్టర్ హరిజవహర్ లాల్ నేతృత్వంలో జిల్లా పంచాయతీ శాఖ... చెరువుల శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెుదటి దశలో స్థానికులను చైతన్యం చేశారు. తర్వాత చెరువుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు. అనంతరం డ్రైనేజీ నీరు తటాకాల్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
విజయనగరంజిల్లా కలెక్టర్ స్ఫూర్తితో గ్రామాల్లో చెరువుల శుద్ధి కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ప్రజలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన, ప్రజా సంఘాలు, విద్యార్ధులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు భాగమవుతున్నారు. చెరువుల శుద్ధితో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అలనా పాలన లేక, ఆనవాళ్లు కోల్పోయిన చెరువుల శుద్ధికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ చర్య జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఇదీ చూడండి: