ETV Bharat / state

'ఒడిశా వల్ల మాకు ఒరిగేదేమి లేదు...ఏపీతోనే ఉంటాం' - vizianagram latest news

కొఠియా వివాదాస్పద గ్రామాల విషయంలో ఏపీ-ఒడిశా ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల ప్రజలకు ఈ రెండు ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించటంతో.. మళ్లీ వివాదం చెలరేగింది.

Kothia villages dispute
కొఠియా గ్రామాల వివాదం
author img

By

Published : Feb 20, 2021, 5:12 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా వివాదాస్పద గ్రామాల్లో వివాదాలకు ఒడిశా ప్రభుత్వం ఆజ్యం పోస్తోంది. కొఠియా గ్రామాల్లో ఈనెల 13న పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి... సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయినా ఎన్నికలు సజావుగా సాగాయి. ఆ గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాల్లోని ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధిహామీ పథకం డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ ఖాతాలను రద్దు చేసినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం 35 కిలోల చొప్పున బియ్యం, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పథకాలు అందిస్తుందని... ఒడిశా ప్రభుత్వం వల్ల తమకు ఒరిగేదేమి లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే ఉంటామని చెప్పారు.

ఇదీ చదవండి:

కేంద్రబడ్జెట్ వల్ల వ్యాపారవర్గాలకే లబ్ధి: డొక్కా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.