గిరిజనులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. సకాలంలో లబ్దిదారులకు అందేలా చూడాలని ఐటీడీఏ పీఓ కూర్మనాథ్.. సిబ్బందిని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు కల్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని చెప్పారు. సాలూరు మండలం, కొదమ గ్రామ పంచాయతీ, పట్టుచెన్నేరు, పగులుచెన్నేర్ పంచాయితీల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న వాటర్ షెడ్డు, ట్యాంకులు పనులు పరిశీలించారు.
పనులు సకాలంలో పూర్తి చేయాలని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. తాగునీరు, వైద్యం, రహదారి, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. చోర, చింతమల, కొదమ, ఎన్.చింతలవలస గ్రామానికి చెందిన 366 కార్డుదారుల కోసం.. పట్టు చెన్నేరులో సరకుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: