విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దొరల తాడివలస గ్రామంలో వైకాపా నాయకులు పాస్టర్లకు నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్యే రాజన్నదొర పాస్టర్లకు నెల రోజులకు సరిపడా సరకులు పంపిణీ చేశారు. పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదును త్వరలోనే పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వీరి సమస్యను గుర్తించి కొందరు దాతలు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చూడండి : వాళ్ల ప్రేమ...అతని ప్రాణం తీసింది