GMR Laxmi Foundation: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లా రాజాంలో సేవా కార్యక్రమాలు కొనసాగాయి. రాజాంలో జీఎంఆర్ లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వస్త్రదానం, అన్నదానం చేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా సుమారు 20 వేల మందికి వస్త్ర, అన్నదానం కార్యక్రమాన్ని జీఎంఆర్ ఫౌండేషన్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు చేతుల మీదుగా చేశారు. రాజాం మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చదవండి :