విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అన్నంనాయుడువలసకు చెందిన సూర్య నారాయణ.. అయిదు ఎకరాలలో వరి పంట సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఉండిలో అవినీతి పెరిగిపోయింది... వైకాపా నేత తిరుగుబాటు దీక్ష