విజయనగరం జిల్లా గజపతినగరం సొసైటీ(PACS) వద్ద ఎరువుల కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఖరీఫ్ సీజన్లో భాగంగా ఎరువుల కోసం రైతులు సొసైటీ వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో సొసైటీలో ఉన్న 200బస్తాల నిల్వలు అయిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట(farmers fight) జరిగింది. రెండు, మూడు రోజుల నుంచి సొసైటీ చుట్టు తిరుగుతున్నా.. ఎరువులు దొరకడం లేదని రైతులు వాపోయారు.
"డీఏపీ కోసం ఉదయం నుంచి క్యూలో పడిగాపులు పడ్డాం. తీరా మా వంతు వచ్చే సరికి స్టాక్ లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకం చూసి ఎరువులు ఇచ్చేవారు. ఇప్పుడు అనేక నిబంధనలు పెడుతున్నారు. తీరా అన్నీ తీసుకొస్తే.. ఇప్పుడు స్టాక్ లేదని చెబుతున్నారు" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి..
Home Minister: హత్య జరిగిన 7 నెలల తర్వాత పరామర్శ యాత్రా ?: హోంమంత్రి