సిద్దసన్నాలు.. జీరసాంబ... హెచ్ఎంటీ... డీఆర్కే.... తునగాడ... నవరా... మాపిల్లిసాంబ... కుదురుత్... పరిమళ సన్నాలు... తూయిమల్లి.... గందసాలి.... మైసూరుమల్లిక.... ఏంటీ ఇవన్నీ అనుకుంటున్నారా...?. ఇవే పూర్వకాలంలో పండించిన వరి దేశీయ రకాలు. కానీ ప్రస్తుతం ఇవి ఎవరికీ తెలియదు. గతంలో వీటిని రైతులు విస్తారంగా సాగు చేసేవారు. ఇవి తినడం వల్ల... 80 సంవత్సరాలు వచ్చినా... ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని నిపుణులు చెబుతున్నారు. అంతటి పోషక విలువలు కలిగిన ఈ దేశీయ రకాలను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు విజయనగరం జిల్లా ప్రకృతి సేద్యం విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు.
నాటి ఆహారం నేటి తరానికి
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఫలితంగా తొందరగా మృత్యువాత పడుతున్నారు. కానీ మన పూర్వీకులు సేంద్రీయ పద్దతిలో సాగుచేసిన ధాన్యం తినేవారు. దీనివల్ల 80 ఏళ్లు వచ్చినా... ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఆనాటి ఆహారం మనకు అందించడానికి... విజయనగరం ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు సన్నద్ధమయ్యారు.
అధిక పోషక విలువలు
దేశీయ విత్తనాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇవి సాగు చేసిన రైతులతో పాటు., సామాన్య ప్రజలు కూడా తింటే ఆరోగ్యంగా ఉంటారు. కీళ్లనొప్పులు, వాత నొప్పులు, కాల్షియం, ఐరన్ లోపం వంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ నేపథ్యంలో దేశీయ విత్తనాలకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది. అందుకోసం దేశీయ విత్తనాలు సాగు చేసేందుకు ఉపక్రమించామని రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారుల సహకారంతో.... ఈ ఖరీఫ్ నుంచి దేశీయ రకాల సాగుకు నడుం బిగించామంటున్నారు.
విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఎంతోమంది రైతులు దేశీయ వరి రకాల సాగు చేపట్టి.... ప్రకృతి, సేంద్రీయ విధానాలతో పెట్టుబడులను ఆదా చేస్తూ.... ఆశించిన మేరకు దిగుబడులు సాధిస్తున్నారు.
ఇదీ చూడండి..