కేంద్రం విడుదల చేసిన ఉపాధి హామీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ పలుచోట్ల సర్పంచ్లు ధర్నా చేశారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జిల్లా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధర్నా చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. బిల్లులకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని..రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ నిధులను దారి మల్లిస్తున్నారని ఆరోపించారు.
విశాఖ జిల్లా నక్కపల్లిలో పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ధర్నా నిర్వహించారు. విశాఖలో ఉపాధి హామీ కింద 62 కోట్ల పనులు పూర్తి చేశామని వీటికోసం అప్పులు సైతం చేశామని ఆంధ్ర ప్రదేశ్ ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యజర్ల వినోద్ రాజు తెలిపారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా పంచాయతీల్లో చేసిన సిమెంటు రోడ్లు, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్స్ మొదలగు పనులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని రేపల్లేలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి