విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు..తమ పంట పొలాలను కాపాడుకోవడం సవాల్‌గా మారింది. ఏనుగుల బెడద నుంచి కాపాడమని రైతులు అధికారులను వేడుకుటున్నారు. స్పందించిన కురుపాం రేంజర్ అధికారి మురళీకృష్ణ చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎవరూ బయటికి రావొద్దని సూచించారు.
ఇవీ చదవండి: కరోనాపై వాట్సాప్ వదంతులు నమ్మొద్దంటున్న వైద్యులు