విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో తెదేపా నేతలు పేదలకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. పురపాలక సంఘం 14వ వార్డులో 400 కుటుంబాలకు మాజీ చైర్ పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి నిత్యావసర సరకులను ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని గూడ్స్ షెడ్ రోడ్లో తేదేపా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పట్టణ అధ్యక్షుడు కోల వెంకట్ రావు ప్రారంభించారు. నాయకులు ఉదయభాను, బి సీతారాం, గౌర్ నాయుడు, సత్యనారాయణ, కుప్పేసి నాయుడు.. పాల్గొన్నారు.
ఇదీ చదవండి: