DGP On Friendly Policing: ప్రతి ఒక్కరితోనూ సేవా భావంతో మెలగడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. విజయనగరం జిల్లా కొత్తపేటలో రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన రెండో పట్టణ పోలీసుస్టేషన్ భవన ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫిర్యాదుదారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులు, ఇతర అంశాలను పరిశీలించారు.
వెనకబడిన, మధ్య తరగతి ప్రజలకు విస్తృత సేవలు అందించాలని పోలీసులకు డీజీపీ సూచించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ.. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు.
ఇదీ చదవండి
ఆ దాబాల్లో మద్యం అమ్మొద్దు.. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి: సీఎం జగన్