విజయనగరం జిల్లాకు సంబంధించి మంజూరైన 33.9 కోట్ల రూపాయల వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం చెక్కులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మహిళా సంఘాలకు అందజేశారు. 11 కోట్ల రూపాయల వైఎస్ఆర్ బీమా చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90.37లక్షల మంది మహిళలకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి తెలియచేశారు.
ఇదీ చదవండి: సంస్కరణల్లో భాగమే.. కొత్త ఎస్ఈసీ నియామకం: ప్రభుత్వం