విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఉప ఖజానా కార్యాలయం ముందు సీఆర్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలకు జీతాల చెల్లింపు విషయంలో అధికారులు కొర్రీలు వేస్తున్నారని యూటీఎఫ్ నాయకులు మురళీమోహన్ రావు ఆరోపించారు. కొన్ని నెలలుగా జీతాలు అందక ఉద్యోగులు తీవ్ర అవస్థలు గురవుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉప ఖజానా సిబ్బంది పనితీరు మారేలా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: