విజయనగరం జిల్లా కురుపాంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం కోసం సేకరిస్తున్న స్థలానికి సంబంధించి సీపీఎం నిరసన చేపట్టింది. 105 ఎకరాల భూమిని సాగు చేస్తున్న గిరిజనులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ కళాశాలకు సేకరిస్తున్న భూమిలో 36 గిరిజనుల కుటుంబాలు సాగు చేస్తున్నాయని... వారికి ఆ భూమే జీవనాధారమని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి వివరించారు. అభివృద్ధికి తాము అడ్డంకి కాదని.... సేకరిస్తున్న భూమిపై ఆధారపడ్డ గిరిజనులకు పరిహారం అందించాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: