ETV Bharat / state

అమ్మతనంపై 'కరోనా' నీడ.. మృత్యు ఒడిలోకి నవజాత శిశువులు - గర్భిణీలపై కరోనా ప్రభావం

నవమోసాలు కడుపులో మోసి, అమ్మతనం కోసం ఆశగా చూసే తల్లులపై కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. నేరుగా కాకపోయినా పరోక్షంగా వారి శోకానికి కారణమవుతోందీ వైరస్. కరోనా కారణంగా వైద్యం సరిగ్గా అందక, సమయానికి ప్రసవం కాక ఎంతోమంది నవజాత శిశువులు కన్నుమూస్తున్నారు. కొంతమంది తక్కువ బరువుతో పుట్టడం, మరికొన్ని కేసుల్లో తల్లీబిడ్డా ఇద్దరూ ప్రమాదపు అంచుల్లోకి వెళ్లడం జరుగుతోంది.

corona effect on pregnent women package
అమ్మతనంపై 'కరోనా' నీడ.. మృత్యు ఒడిలోకి నవజాత శిశువులు
author img

By

Published : Jul 17, 2020, 4:38 PM IST

విజయనగరం జిల్లాలో గత 3 నెలల కాలంలో 50 నుంచి 60 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. అందుకు ఎన్నో కారణాలున్నా ప్రధాన కారణం మాత్రం కరోనానే. దీనివలన సరైన సమయానికి చికిత్స అందక ఎందరో శిశువులు మృతిచెందారు.

చూడకుండానే మందులు

జిల్లాలోని పార్వతీపురానికి చెందిన ఓ మహిళ లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ వైద్యురాలి వద్దకు పరీక్షలకు వెళ్లేవారు. కరోనా భయంతో ఆ డాక్టర్ ఆమె పరిస్థితిని సరిగ్గా చూడకుండానే అంతా బాగానే ఉందని చెప్పి మందులు రాసి పంపేవారు. తీరా ప్రసవ సమయానికి కడుపులో బిడ్డ బరువు తక్కువగా ఉందని చెప్పి శస్త్రచికిత్స చేయగా కవలలు జన్మించారు. వారిలో ఏ ఒక్కరూ దక్కలేదు. ముందుగానే పరీక్షలు చేసి కవలలనే విషయం చెప్పి ఉంటే జాగ్రత్తగా ఉండేదాన్నంటూ ఆ మహిళ వాపోయింది.

తక్కువ బరువుతో

విజయనగరానికి చెందిన ఓ గర్భిణి ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంది. నెలలు నిండాయని ప్రసవం కోసం వెళితే ఉమ్మనీరు తగ్గింది. వెంటనే శస్త్రచికిత్స చేయాలని ఆసుపత్రిలో చేరమన్నారు. చివరికి బిడ్డ కేజీన్నర బరువుతో పుట్టింది. బతకడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు.

ఎస్.కోట మండలానికి చెందిన ఒక బాలింత తన బిడ్డకు అత్యవసర వైద్యం అవసరమని కేజ్ హెచ్​కు తీసుకెళ్లింది. ఆ గ్రామంలో పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయని, తగ్గాక రావాలని వెనక్కి పంపించేశారు.

గుర్ల మండలానికి చెందిన 8 నెలల గర్భిణీ మొదటి నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇటీవల పరీక్షల కోసం వెళితే మీ గ్రామంలో కరోనా కేసులున్నాయి కదా.. కరోనా రిపోర్టు తెస్తేనే చూస్తాం లేకుంటే మరోచోటుకు వెళ్లాలని వైద్యులు చెప్పారు.

సరైన సమయానికి అందని వైద్య సేవలు

ఇలాంటి ఎన్నో ఘటనలు శిశువుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. కరోనా భయంతో ప్రైవేటు వైద్యులు గర్భిణీలకు సరైన చికిత్స అందించడం లేదనే విమర్శ ఉంది. తక్కువ బరువుతో మార్చి, ఏప్రిల్ నెలలో 68 మంది చిన్నారులు, మేలో 82మంది, జూన్​లో 72మంది జన్మించటం ఇందుకు నిదర్శనం. కరోనా ప్రభావంతో వీరికి స్థానికంగా సరైన వైద్య సేవలు అందకపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు గర్భిణుల విషయంలో సాధారణ కేసులను మాత్రమే స్వీకరిస్తున్నాయి. ఏ మాత్రం రిస్కు ఉందనిపించినా ప్రభుత్వ ఆసుపత్రులకే పంపుతున్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి వైద్యపరీక్షలు చేస్తూ వస్తున్న వారే ప్రసవ సమయంలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇవీ చదవండి...

కరోనాతో మృతి..తమ ప్రాంతంలో ఖననం వద్దని స్థానికుల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.