విజయనగరంలో స్థానిక మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ తనిఖీ చేశారు. ఆసుపతిల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆక్సిజన్, మందుల లభ్యతపై ఆరా తీశారు. ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా ఉన్న అన్ని పడకలూ రోగులతో నిండిపోయాయని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ కలెక్టర్‌కు తెలిపారు. సాధారణ పడకలు 550 ఉన్నాయని.. వాటిలో 78 మంది రోగులు ఉన్నారని వివరించారు. 472 సాధారణ పడకలు ఉన్నాయని చెప్పారు. కొవిడ్ పరీక్ష ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి: విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి