జగనన్న తోడు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ కలెక్టర్ ఆడిటోరియంలో ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. బ్యాంకుల సహకారం లేకపోవడం వల్లే ఈ పథకం అమలులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని, రుణాల మంజూరుకు సంబంధించి డాక్యుమెంటషన్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది నుండి పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నా బ్యాంకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యంత తక్కువగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల అధికారుల నుండి వివరణ కోరారు. రుణాల మంజూరుకు సహకరించిన ఆయా బ్యాంకుల బ్రాంచి మేనేజర్లతో కలెక్టర్ నేరుగా ఫోనులో మాట్లాడారు. ఏ కారణంతో రుణాలు మంజూరులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పటికే రుణాలు మంజూరు చేసిన లబ్దిదారులకు సంబంధించిన సమాచారం వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సహకరించని బ్యాంకు బ్రాంచిల జాబితా తమకు అందజేస్తే వారితో ప్రత్యేకంగా మాట్లాడి కారణాలు తెలుసుకుంటామన్నారు. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు వంటి అధిక బ్రాంచిలు ఉన్న బ్యాంకులు తగిన సామర్ధ్యం ప్రదర్శిస్తేనే అధికంగా రుణాలు అందించగలమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవ చదవండి