మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకునేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నమోదు చేసిన సొసైటీ పత్రాలను ఆయా సంఘాలకు జిల్లా పాలనాధికారి హరిజవహర్‌లాల్ అందజేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌ల పనులను దూరదృశ్య సమావేశం ద్వారా ప్రారంభించారు. విజయనగరం నుంచి కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, శాసనమండలి సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యే అప్పలనాయుడు, సంయుక్త కలెక్టర్ జీసీ కిశోర్‌కుమార్, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆక్వా బజారుకు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్ సొసైటీ నమోదు పత్రంతో పాటు బైలాను సంఘ సభ్యులకు అందజేశారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగు సౌకర్యం, గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున రాష్ట్రంలోనే విజయనగరం తొలి సొసైటీగా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. దీంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పారు. 62 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశారు. వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన రూ.13.5 లక్షల రుణానికి సంబంధించిన పాస్ పుస్తకాలను అందించారు.
ఇదీ చదవండి: