ETV Bharat / state

CM JAGAN: ఉత్తరాంధ్రకు కీర్తి కీరిటంగా భోగాపురం ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు : జగన్​

CM Jagan Comments: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీర్తి కిరీటంగా నిలవబోతుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన.. పలు వ్యాఖ్యలు చేశారు.

CM Jagan on Visakha
CM Jagan on Visakha
author img

By

Published : May 3, 2023, 12:46 PM IST

Updated : May 3, 2023, 1:42 PM IST

ఉత్తరాంధ్రకు కీర్తి కీరిటంగా భోగాపురం ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు

CM Jagan Comments: విజయనగరం జిల్లాలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్​ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్​ 19న శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్​ఫీల్డ్​ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు.. సెప్టెంబర్​ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు చెప్పిన జగన్​.. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు విశాఖ ఆమోదయోగ్యమైన నగరంగా ఉంటుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీర్తి కిరీటంగా నిలవబోతుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరానికి సమాన దూరంలో ఎయిర్‌పోర్టు ఉంటుందని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు మరో 3 ఏళ్లలో పూర్తవుతుందని.. 2026 నుంచే భోగాపురం వద్ద విమానాలు ఎగిరే పరిస్థితి నెలకొంటుందని స్పష్టం చేశారు.

ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారుతుంది. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళానికి సమాన దూరంలో ఎయిర్‌పోర్టు. రూ.195 కోట్లు ఖర్చు చేస్తూ తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. చింతపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే ప్రాంతంగా ఉండేది.రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర మారబోతోంది. ఒకవైపు పోర్టు, మరోవైపు ఎయిర్‌పోర్టు రాబోతోంది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు మరో 3 ఏళ్లలో పూర్తవుతుంది. 2026 నుంచే భోగాపురం వద్ద విమానాలు ఎగిరే పరిస్థితి ఏర్పడుతుంది"-జగన్​, ముఖ్యమంత్రి

డేటా సెంటర్​తో రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతోంది: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని.. అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవని.. కానీ, రాబోయే రోజుల్లో అది జాబ్‌ హబ్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఈ మధ్యే పోర్టుకు శంకుస్థాపన చేశామన్న ఆయన.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్​పోర్టు మారనుందని ఆకాంక్షించారు. నేడే విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. డేటా సెంటర్‌తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని​ భావిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా: 2026లో తానే వచ్చి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తానని జగన్​ తెలిపారు. కేవలం 24 నుంచి 30 నెలల్లోనే ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తామని జీఎంఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏ380 డబుల్‌ డెక్కర్‌ ల్యాండ్‌ అయ్యేలా.. ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి దశలో 60 లక్షల జనాభాకు సదుపాయలు సమకూరుస్తామని.. చివరి దశకు వచ్చే సరికి నాలుగు కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.