విజయనగరం రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
రహదారి ప్రమాదం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవటంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. నలుగురు మృతి