విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామంలో విషాదం నెలకొంది. ఈత కోసం నదిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు విడవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గ్రామ దేవత పండుగకు వచ్చి..
గ్రామ దేవత పండుగకు తాత ఇంటికి వచ్చిన ముగ్గురు చిన్నారులు... పెద్దమ్మ కుమారులైన నలుగురితో కలిసి ఈత కోసం నదిలో దిగారు. నీటిలోకి జారిపోయిన సోదరుడు ఆనంద్‌ను కాపాడే క్రమంలో అన్నయ్య నరేష్ కూడా నీటిలో మునిగిపోయాడు. మిగిలిన సోదరులు ఒడ్డుకు చేరుకొని తమ వారిని కాపాడమని ప్రాధేయపడినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100, 108 నెంబర్లకు ఫోన్ చేసినా ఎవరు స్పందించకపోవడంతో ఇద్దరిని ద్విచక్రవాహనాలపై ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదన్నారు. అధికారులు స్పందించకపోవడం వల్లే తమ బిడ్డల ప్రాణాలు పోయాయంటూ బంధువులు ఆరోపించారు.
ఇదీచదవండి.