విజయనగరం జిల్లా బొబ్బిలిలో కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలిపారు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి.. ల్యాబ్ పని తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోమవారం ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు బొబ్బిలి నియోజకవర్గంలో 9 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. కొంతమంది అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారనీ.. దీని వలన ప్రజలు మరింత ఆందోళన చెందే అవకాశం ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన ఆసుపత్రిలో స్థలాభావం కొరత ఏర్పడిందనీ.. ప్రస్తుతం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో మృతిచెందిన రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు