సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డులో వైకాపా అభ్యర్థిగా.. భవిరెడ్డి గౌతమి పోటీ చేస్తున్నారు. ఆమె తన నామినేషన్లో గృహిణిగా పేర్కొన్నారు. అయితే గౌతమి పాచిపెంట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 104 వాహనంలో ఏఎన్ఎంగా పని చేస్తోందని తెదేపా నేత నిమ్మది తిరుపతిరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల 1965 యాక్ట్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.
ఇదీ చదవండీ.. పురపాలక ఎన్నిక పోరు: ఏకగ్రీవాలు, బుజ్జగింపులు