ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్మిషన్లు తీసుకున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, ఏబీవీపీ నాయకులు విజయనగరం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కరోనా లాక్డౌన్లో 50% ఉపాధ్యాయులను తొలగిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ రమణ, జిల్లా కన్వీనర్ సాయి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి... : నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు