విజయనగరం జిల్లా చీపురుపల్లి బ్రిడ్జ్‌టౌన్ వద్ద నడుస్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సుంకరి మురళి కృష్ణ(54)గా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు చీపురుపల్లి ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు