విశాఖ జిల్లాలో పరిషత్ ఎన్నికల లెక్కింపు ముగింసింది. మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక స్థానం ఏకగ్రీవం కాగా... ఆనందపురంలో తెదేపా అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 37 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. అధికార వైకాపా 35, తెదేపా 1, సీపీఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. జిల్లాలో మొత్తం 652 ఎంపీటీసీ స్థానాలుండగా 37 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 612 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో వైకాపా450, తెదేపా 118, భాజపా 06, కాంగ్రెస్ 02, సీపీఎం 03, సీపీఐ 02 , జనసేన 02, ఇతరులు 28 చోట్ల గెలుపొందారు. బ్యాలెట్ బాక్స్ పాడవ్వడం పాకలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితం ప్రకటించలేదు. మొత్తం 4500 మంది సిబ్బంది విధులు నిర్వహించారు
కౌంటింగ్ జిరిగిందిలా...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఉదయం 8గంటల నుంచి విశాఖపట్నం జిల్లాలోని 39 మండల కేంద్రాల్లో 80 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 612 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 1,793 మంది పోటీ పడ్డారు. 39 జడ్పీటీసీ స్థానాలకు రోలుగుంట స్థానం ఏకగ్రీవమైంది. ఆనందపురం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. 37 జడ్పీటీసీ స్థానాలకు 172 మంది పోటీ పడ్డారు.
అనకాపల్లిలో ఐదు, కె.కోటపాడు, కోటవురట్లలో నాలుగు చొప్పున, మిగిలిన చోట్ల ఒకటి నుంచి మూడు వరకు మొత్తం 79 హాళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం రిజర్వు సిబ్బందితో కలిపి 3,811 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీవోస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా, జిల్లా అధికారులను మండలాలకు ఆర్వోలుగా, ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఏఆర్వోలుగా నియమించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. తరువాత సాధారణ ఓట్లు లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల లోపల, బయట పరిసరాల్లో కొవిడ్ నిబంధనలను పక్కా అమలు చేస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో 144 సెక్షన్తోపాటుగా కొవిడ్ నిబంధనలు ఆమల్లో ఉన్నాయి.
ఫలితాలు ఇలా..
ఇదీ చదవండి..