ఓటీటీలో విడుదల కానున్న 'జాంబి రెడ్డి' - aha latest movies
విశాఖ జిల్లాలో 'జాంబిరెడ్డి' చిత్రబృందం సందడి చేశారు. ఈ నెల 26న ఓటీటీలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. త్వరలో జాంబిరెడ్డి 2 తీస్తామన్నారు. 'ఆహా' ఓటీటీ ద్వారా మంచి ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల విడుదలై విజయం సాధించిన 'జాంబిరెడ్డి' చిత్రాన్ని ఈ నెల 26న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. థియేటర్లలో ఊహించిన దానికంటే అధికంగా వసూలు రాబట్టిందని.. 'ఆహా' ద్వారా మంచి ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆహా ప్రీ రిలీజ్ టూర్ విశాఖ నుంచి ప్రారంభించామని.. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో నిర్వహించి... సినిమా ఇప్పటివరకు చూడని ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి 2 తీయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటులు తేజ సజ్జ, ప్రశాంత్, జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!