సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో వైఎస్ఆర్ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ టోర్నమెంట్లో 99 డివిజన్ల నుంచి 422 జట్లు, 6వేల 500 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. మంగళవారం నుంచి వచ్చే నెల 9 వరకు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. క్రీడాకారులకు 50 లక్షలు విలువైన బహుమతులు అందిస్తునట్టు చెప్పారు. గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ పరిపాలన రాజధాని గానే కాక..క్రీడా రాజధానిగా మార్చాలని.. అందుకు తగ్గట్టుగా అధికారులు ప్రణాళిక వేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు కోరారు. క్రీడలు వ్యక్తిత్వ మనో వికాసానికి తోడ్పడతాయని మంత్రి చెప్పారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట్ సత్యవతి, శాసన సభ్యులు తిప్పలనాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్ రాజా, కలెక్టర్ వినయచంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.
అనకాపల్లిలో ప్రారంభం
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు వైఎస్ఆర్ కప్ పేరుతో క్రికెట్ పోటీలను రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో జీవీఎంసీ పరిధిలోని క్రికెట్ జట్లకు నిర్వహిస్తున్న పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన క్రికెట్ జట్టుకి రూ. 10 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 5లక్షలు అందజేస్తారన్నారు.
ఇదీ చదవండి: