పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నారు. మన్యంలోని చింతపల్లి యువజన శిక్షణ కేంద్రంలో విద్యార్థులు, ఓఎస్డీ సతీష్‌కుమార్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. విద్య ప్రాముఖ్యత, నైపుణ్యాల అభివృద్ధి గురించి విద్యార్థులకు వివరించారు. కష్టపడి పనిచేయడమే విజయానికి మార్గమని, సత్వరమార్గాలు ఉండవని ఎస్పీ స్పష్టం చేశారు.
గిరిజన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికే పోలీసుశాఖ సంకల్పం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఓఎస్డీ సతీష్ కుమార్ అన్నారు. బడి మానేసిన విద్యార్థులకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఏఎస్పీ చింతపల్లి విద్యా సాగర్ నాయుడు అన్నారు. ఏ సమస్య ఎదురైనా సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పీఎల్జీఏ వారోత్సవాలు.. చింతపల్లి సబ్‌డివిజన్‌లో తనిఖీలు