ప్రియడు పెళ్లికి నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. డీసీపీ పి. సరేశ్ కథనం ప్రకారం... ఒడిశా రాయఘడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్టవి చిన్నముసిడివాడ ప్రాంతానికి చెందిన షణ్ముక తేజలు నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో వేరువేరుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వైష్ణవి గురువారం మధ్యాహ్నం చిన్నముసిడివాడలోని తేజ నివాస సముదాయానికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. తేజ పెళ్లికి నిరాకరించటంతో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం మనస్థాపంతో వైష్ణవి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్నామని తెలిపిన డీసీపీ మరింత సమాచారం కోసం ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీచదవండి