విశాఖ మన్యం పాడేరు మండలం గుత్తులపుట్టు సంతలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాడేరు మన్యంలో 18 వేల హెక్టార్లలో పసుపు సాగుచేస్తున్నారు. దీని ద్వారా 10 వేల మెట్రిక్ టన్నుల పసుపు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీన్ని గుర్తించిన పాడేరు ఐటీడీఎ గుత్తులపుట్టు సంతలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. వ్యాపారులు ఇక్కడికే వచ్చి పంటను కొనేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, భౌతిక దూరం ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పసుపు అమ్మకాలు పరిశీలించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ అధికారి బాలాజీ సూచించారు.
ఇవీ చదవండి.. 'ప్లాస్మాథెరపీ కరోనా రోగుల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది'