ETV Bharat / state

పేరుకే కార్పొరేషన్లు.. బీసీలకు చేయూత ఏదీ...? - ఏపీలో బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు

BC-Corporation: వైసీపీ సర్కార్‌ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లు బీసీలకు ఆర్థిక చేయూత అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇవి కేవలం వైసీపీ నేతల రాజకీయ పునరావాసానికే పరిమితమయ్యాయి. పైసా పని కాకుండానే..వీటి ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ఇవాల్టితో ముగిసిపోనుంది. బీసీల స్వయం ఉపాధికి దన్నుగా నిలుస్తాయంటూ వీటిని ఏర్పాటు చేసినా..ఈమూడున్నరేళ్లలో 56 కార్పోరేషన్లకు కేవలం 132 కోట్లే ఇచ్చారు.

BC-Corporation
బీసీ కార్పొరేషన్
author img

By

Published : Dec 16, 2022, 6:59 AM IST

Updated : Dec 16, 2022, 8:07 AM IST

BC-Corporation: రెండేళ్ల క్రితం డిసెంబరు 17న ప్రభుత్వం ‘బీసీల సంక్రాంతి’పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించింది. 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్‌కు 12 మంది చొప్పున డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వెనుకబడిన తరగతులకు ఆర్థిక చేయూత అందించడంలో వెన్నెముకగా నిలబడాలనేది ఈ కార్పొరేషన్ల లక్ష్యం. అయితే నిధులూ, విధులూ లేని ఈ కార్పొరేషన్లతో..ఆ లక్ష్యసాధనలో ఒక్క అడుగు కూడా వేయకుండానే.. రేపటితో వారి పదవీకాలం ముగిసిపోతోంది. ఇది బీసీల ఉపాధి కల్పన చరిత్రలో మునుపెన్నడూ చూడని విషాద ఘట్టం.

వెనుకబడిన తరగతుల వారిని పేదరికం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇచ్చే రాయితీ రుణాలు వారికి గొప్ప అవకాశం. ప్రభుత్వం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం, ఆరోగ్య పథకాలు, వృద్ధులకు సామాజిక భద్రతా పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నా..శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేయగలిగేది మాత్రం రాయితీ రుణాలతోనే. దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చాయి. వాటిని వినియోగించుకుని వేల బీసీ కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించి తలెత్తుకుని జీవిస్తున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ పేదరికాన్ని తరిమికొట్టాయి. ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఘనంగా ప్రకటించడమే తప్ప.. గత ప్రభుత్వాలతో పోలిస్తే వాటి ద్వారా స్వయం ఉపాధి కింద రుణాలిచ్చింది చాలా తక్కువ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో స్వయం ఉపాధికి 16 వందల26 కోట్ల రుణాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వం తాము ప్రాధాన్యంగా భావించిన రేషన్‌ పంపిణీ వాహనాలకు 132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించింది. పైగా గత ప్రభుత్వం బీసీలకు రాయితీ రుణాల కింద ఇచ్చి.. బ్యాంకుల్లో మిగిలిపోయిన 200 కోట్లనూ వెనక్కు తీసుకుంటోంది.

పేరుకే కార్పొరేషన్లు.. బీసీలకు చేయూత ఏదీ...?

కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు గతంలో 20 నుంచి 50 శాతం వరకు రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించాయి. లక్ష నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో యాదవుల అభివృద్ధికి ఫెడరేషన్‌ ద్వారా కేంద్ర సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఈ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి. ఇందులో 20 శాతం రాయితీ, మరో 20 శాతం లబ్ధిదారు వాటా. 60 శాతం పావలా వడ్డీ రుణం. దాదాపుగా 80 కోట్లు ఖర్చు చేసినట్లు బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇవికాకుండా 50 శాతం రాయితీతో 25 లక్షలు రుణాలిచ్చి మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఉపాధి హామీ పథకం కింద గొర్రెలు, బర్రెలు షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాన్నిచ్చిందని పేర్కొంటున్నారు. రజకులు, కల్లుగీత కార్మికులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, వాల్మీకి, ఇతర బీసీ కులాలకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాలు అందాయి. లక్ష రాయితీతో 2 లక్షల వరకు రుణంగా ఇచ్చారు. వీటి ద్వారా వేల సంఖ్యలో లబ్ధిదారులకు మేలు చేకూర్చారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడున్నరేళ్లలో బీసీలకు స్వయం ఉపాధి కల్పన ద్వారా శాశ్వతంగా పేదరికాన్ని దూరం చేసేందుకు ఏం చేశారో చెప్పకుండా అన్ని పథకాల్లోని బీసీలకిచ్చే వాటాను పక్కకు తీసి..పెద్దమొత్తంలో సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు అంకెల గారడీ చేస్తున్నారు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా చూపిస్తూ తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా బీసీలకే నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నా..వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాల స్థాయి కాదు. వైసీపీ ప్రభుత్వం వీటితోపాటు అందరికీ అందించే పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, వడ్డీ రాయితీ, చేయూత పథకాలనూ బీసీల ఖాతాల్లోనే వేస్తోంది. బీసీల్లోని పేదలకు ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో 11 బీసీ సమాఖ్యలు ఉండేవి. వైసీపీ అధికారం చేపట్టాక రెండేళ్ల కిందట 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. సంఖ్య పెరిగినా, వాటి ద్వారా బీసీలకు ఒరిగిందేమీ లేదు. పైగా ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు, మద్దతుదారులను కార్పొరేషన్‌కు ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించుకుని రాజకీయ పునరావాసానికి కేంద్రంగా మార్చేసింది. నెలకు ఛైర్మన్‌కు 56 వేలు, డైరెక్టర్లకు 12 వేల చొప్పున ఇస్తూ..పార్టీ నేతల పోషణకే పరిమితం చేసింది. ఛైర్మన్‌కు వాహన భత్యం కింద 60 వేలు, సహాయకుడి వేతనంగా మరో 12 వేలు చెల్లిస్తోంది. బీసీల్లోని పేదలకు ఆర్థిక తోడ్పాటు అనే అసలు లక్ష్యాన్ని నీరుగార్చింది. బీసీలకు సాయం చేయకుండానే రేపటితో ఛైర్మన్ల పదవీకాలం పూర్తికాబోతోంది.

మూడున్నరేళ్లుగా బీసీ కార్పొరేషన్లను విధుల్లేని సంస్థగా మార్చిన ప్రభుత్వం..కొత్తగా ఒక్కో కార్పొరేషన్‌కు 2 లక్షలు కేటాయించింది. ఇదీ బీసీలకు సాయం అందించేందుకు కాదు.. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న బీసీ సంఘాల నేతల్ని వైసీపీ వైపు ఆకర్షించేందుకేనని స్వయంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పడం గమనార్హం. 2 లక్షలతో ఆయా బీసీ సంఘాల నేతల్ని సన్మానించి వైసీపీ వైపు మళ్లేలా చేయాలని మంత్రి ఇటీవల సెలవిచ్చారు.

బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం టీడీపీ ప్రభుత్వం 2016లో ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. మిగతా వర్గాలకు 50 శాతం వరకు రాయితీతో రుణాలివ్వగా ఎంబీసీలకు 90 శాతం సబ్సిడీ అందించింది. గత ప్రభుత్వంలో 21వేల 711 మంది 84 కోట్ల మేర లబ్ధి పొందారు. జగన్‌ బాధ్యతలు చేపట్టాక వీరికీ మొండిచేయే చూపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి రుణాల్ని అందించకపోగా.. గత ప్రభుత్వం అందించిన రాయితీనీ వెనక్కి తీసుకుంటోంది. టీడీపీ హయాంలో అన్ని కార్పొరేషన్ల ద్వారా అందించి.. ఖర్చుకాకుండా మిగిలిపోయిన మొత్తం 488 కోట్లు బ్యాంకుల్లో ఉంది. అందులో బీసీలకు చెందిన రాయితీ 200 కోట్లు ఉంది. దీన్నీ వెనక్కి తీసుకుంటోంది.

బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ స్వయం ఉపాధి రుణాలు అందిస్తుంది. గత ప్రభుత్వంలోనూ దీని ద్వారా బీసీలు పెద్దఎత్తున రుణాలు పొందారు. యూనిట్‌ ఏర్పాటుకు ఇచ్చే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ అందిస్తుండగా లబ్ధిదారు 10 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ఎన్‌బీసీఎఫ్‌డీసీ రుణంగా ఇస్తుంది. 2019లో దీన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత పక్కనపెట్టింది. అప్పుడూ 36 కోట్ల రుణమంజూరుతో ప్రక్రియను చేపట్టి..నిబంధనల్ని కఠినతరం చేసి 26 కోట్లకు పరిమితం చేసింది. దీని ద్వారా 305 మందికే ఆర్థికసాయం అందించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Dec 16, 2022, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.