విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆర్మీలో పని చేస్తున్న మహేశ్వరరావు.. తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పాయకరావుపేట వెళ్తున్న సమయంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. భార్య మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన మహేశ్వరరావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి
మహేశ్వరరావు, విజయలక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాయకరావుపేట ప్రైవేట్ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: