ETV Bharat / state

బంగాల్ పర్యటకులకు విశాఖపై ఆసక్తి ఎందుకు తగ్గింది?

ప్రతి ఏటా సెప్టెంబర్​ నెల మొదలైందంటే చాలు పశ్చిమబంగాకు చెందిన పర్యటకులతో విశాఖలోని సందర్శనీయ ప్రాంతాలు కళకళలాడేవి. జనవరి వరకు నగరంలో ఎక్కడ చూసినా వారి సందడే కనిపించేది. హోటళ్లలోని గదులన్నీ కొద్ది రోజుల ముందుగానే వంద శాతం బుక్ అయ్యేవి. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశాఖ జిల్లాకు వారి రాక తగ్గిపోయింది. దీనికి కారణాలేంటో పూర్తి కథనంలో చూడండి.

vishaka
vishaka
author img

By

Published : Dec 4, 2020, 7:18 PM IST

ఎన్నో అందాలకు నెలవైన విశాఖ జిల్లాను సందర్శించేందుకు పశ్చిమబంగా​ వాసులు అమితాసక్తి ప్రదర్శిస్తారు. ప్రతి ఏటా సెప్టెంబర్​ నెల నుంచి జనవరి వరకు బెంగాళీయులతో విశాఖలోని సందర్శనీయ ప్రాంతాలు కళకళలాడేవి. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వారి సందడే కనిపించేది. పశ్చిమబంగా నుంచి విశాఖకు వచ్చే పర్యాటకుల కోసం కోల్‌కతాలో ఏపీ టూరిజం సెంట్రల్‌ రిజర్వేషన్‌ కేంద్రాన్ని గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. దీని ద్వారానే కోల్‌కతా వాసులు విశాఖలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చేందుకు రిజర్వేషన్‌ చేయించుకుంటారు. సీజన్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారిలో 70 శాతం మంది బంగా వాసులు ఉండగా.. 10 శాతం మంది తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తుంటారు. మిగిలిన 20 శాతం మంది స్థానికులే. అయితే ఈ ఏడాది బెంగాళీయులు విశాఖకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని లెక్కలు చెబుతున్నాయి.

రవాణా... కరోనా భయం
కరోనా వైరస్​ ప్రభావంతో విశాఖకు వచ్చేందుకు మెరుగైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, విశాఖ నుంచి అరకుకు రైళ్లు నడపకపోవటంతో ఎక్కువమంది బంగా వాసులు రావడానికి ఇష్టపడడం లేదు. గతంలో మూడు, నాలుగు రోజులు విశాఖ, అరకు ప్రాంతాల్లో పర్యటించేందుకు రైళ్లు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు. ఇపుడు రైళ్లు లేకపోవటంతో ఎక్కువమంది రాలేకపోతున్నారు. ముఖ్యంగా కరోనా భయంతో వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో బొర్రా గుహలను లక్ష మంది సందర్శిస్తే.. ఈ ఏడాది డిసెంబర్​ వరకు 17వేల మంది మాత్రమే వచ్చారు. ప్రస్తుతం వస్తున్న పర్యాటకుల్లో కేవలం పది శాతం మాత్రమే బెంగాల్‌ వాసులు ఉంటున్నారు. కోల్‌కతా నుంచి వచ్చే పర్యాటకులతోనే ఏటా విశాఖ డివిజన్​కు రూ.30 కోట్లపైన ఆదాయం వచ్చేది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు కోట్లయినా మించలేదు. అంతేకాకుండా నగరంలోని హోటళ్లు, ట్రావెల్‌ ఏజెంట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

వాయిదా వేస్తున్నారు

కరోనా భయంతో ఎక్కువ మంది బంగా‌ ప్రజలు విహార యాత్రలను వాయిదా వేసుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వస్తేగాని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేలా కనిపించడం లేదు. గతంలో వందల్లో మమ్మల్ని సంప్రదించేవారు. ఇపుడు పదుల సంఖ్యలోనైనా రావడం లేదు. వచ్చిన వారి సందేహాలు నివృత్తి చేసి పంపుతున్నాం- అసిత్‌కుమార్, కోల్‌కతా యూనిట్‌ ఇన్‌ఛార్జి

ఇదీ చదవండి

అత్యాధునిక గస్తీ సంపత్తి సిద్ధమవుతోంది: అతుల్​కుమార్​జైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.