విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేబాకలోని క్వారంటైన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరావు పరిశీలించారు. కరోనా సోకిన రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు సరిగా లేవని ఫిర్యాదులు రావటంతో జాయింట్ కలెక్టర్ పరిశీలనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మెనూ ప్రకారం అందిస్తున్న తీరు వైద్య సదుపాయాలు ఆరా తీశారు. మెనూ చార్ట్ పెట్టి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి
బీసీలకు జగన్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది: ఎమ్మెల్యే అనగాని