ETV Bharat / state

మన్యంలో 144 సెక్షన్: అయినా విందుకు వచ్చారు..!

author img

By

Published : Mar 24, 2020, 11:14 PM IST

ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే విశాఖ మన్యంలో విందు భోజనాలు అంటూ ప్రజలు గుమిగూడి దర్శనమిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కరోనా వ్యాధిపై అవగాహన లేక కరోనాతో మాకేంటి అంటూ... పెళ్లి సందడిలో కనిపించారు.

vishakha manyam
144 సెక్షన్ లెక్కచేయని మన్యం ... పెళ్లి సందడిలో ప్రజలు
మన్యంలో 144 సెక్షన్: అయినా విందుకు వచ్చారు..!

విశాఖ మన్యం హుకుంపేట మండలం మండిపుట్టులో ఓ వివాహ విందు కార్యక్రమం జరిగింది. మన్యం నలు మూలల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాను లాక్​డౌన్​గా ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు. అయినా బేఖాతరు చేస్తూ మన్యం వాసులు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కాలిబాటన విందుకు హాజరయ్యారు. ఇంత తతంగం జరుగుతున్నా స్థానిక వాలంటీర్లు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మన్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి... ఏ చిన్న అంటురోగం వచ్చినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని... ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి-సహకరించని వారిపై చట్టపరమైన చర్యలు: ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.