విశాఖ జిల్లా మునగపాక మండలం గంటవాని పాలెంకి చెందిన కొన జగదీష్ అనే విద్యార్థి అనకాపల్లిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలవ్వటంతో మనస్తాపం చెందిన జగదీష్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. విద్యార్థి తండ్రి గోవిందు వ్యవసాయం చేసుకుంటూ తన కుమారుడిని చదివిస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలు తప్పడంతో మనస్తాపం చెంది కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.
ఇవీ చదవండి