విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలపై గిరిజనులు, ప్రజాసంఘాల మద్య తలెత్తిన భేదాభిప్రాయాల పై..నేడు కలెక్టరేట్ లో విచారణ జరగనుంది. గ్రానైట్ క్వారీలు వల్ల కళ్యాణలోవ జలాశయాని ఎలాంటి ఇబ్బంది ఉండదని గిరిజనలు అంటున్నారు. తమ ప్రాంతంలో ఉన్న 4 గ్రానైట్ క్వారీలతో వంద మందికి ఉపాధి లభించిందని, 40 శాతం రాయల్టీ పన్ను తమ పంచాయితీకే దక్కుతుందని తెలిపారు. క్వారీలు ఉండటం వల్లే తమ ప్రాంతానికి రహదారి వచ్చిందని అంటున్నారు. ఈ కారణాలతోనే తాము గ్రానైట్ క్వారీలను సమర్ధిస్తున్నామని చెప్పారు. గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేక కొంతమంది కావాలనే గొడవ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి