విశాఖ జిల్లా పాయకరావుపేటలో బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని జిల్లా సంక్షేమ శాఖ డీడీ రాజేశ్వరి పరిశీలించారు. వసతి గృహంలో రికార్డులు తనిఖీ చేశారు. నవంబర్ లో వసతి గృహాలు తెరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్వర్ణ కుమారి వార్డెన్ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: