విశాఖ జిల్లా ట్రెజరీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని.. ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లు (vishaka treasury office in bad condition)గా తయారైంది. తుపాను ధాటికి.. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా.. కార్యాలయ పైకప్పు నుంచి నీరు కారుతోంది. చిన్న వర్షానికి కూడా కార్యాలయంలో నీరు చేరి.. పని చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు, ఇతర వస్తువులు తడవకుండా కవర్లు కప్పేయటంతో.. ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కువమంది మహిళా ఉద్యోగులు ఉన్న ఈ కార్యాలయంలో టాయిలెట్లు సరిగ్గా లేకపోవటం దురదృష్టకరం. ఉద్యోగులంతా.. కార్యాలయ పరిస్థితిపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జునకి తెలియజేశారు.
ఇదీ చదవండి: