ETV Bharat / state

'రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం' - విశాఖ ఏజెన్సీ న్యూస్​

విశాఖ ఏజెన్సీ మండలాల్లో తమకు రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో... స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదివాసీ సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌లో 11 ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించకపోవటంపై ఐకాస మండిపడింది.

visakha tribal jac boycot the local elections at visakha agency
'రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరిస్తాం'
author img

By

Published : Feb 9, 2020, 8:08 PM IST

రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరిస్తామన్న ఆదివాసీ కార్యాచరణ కమిటీ

తమకు రిజర్వేషన్లు లేని ఏజెన్సీ మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదివాసి సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. విశాఖ జర్నలిస్టు ఫోరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో.. ఏజెన్సీలో 12వ తేదీన నిర్వహించనున్న భారీ నిరసన సభ గోడ పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ప్రభుత్వం విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​లో 11 ఏజెన్సీ మండలాలకు గాను నాలుగు బీసీలకు, ఏడు జనరల్​కు ప్రకటించడాన్ని జేఏసీ కన్వీనర్ రామారావు దొర తప్పుబట్టారు. బీసీలకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరించేందుకు గిరిజన ప్రజానీకం సన్నద్ధంగా ఉన్నారని వివరించారు.

ఇదీ చదవండి:

రేవుపోలవరంలో భక్తులతో పోటెత్తిన సముద్రం తీరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.