రాంబిల్లి మండలం దిమిలి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ ఎల్.శివశంకర్ పరిశీలించారు. జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రం పరిధిలో ఎంతమంది రైతులున్నదీ వివరాలు తీసుకొని ఈ-కర్షక్‌లో నమోదు చేయాలని సంబంధింత అధికారులకు చెప్పారు.
రైతు పంటకోసిన రోజు, నూర్పు చేసిన ధాన్యం ఎన్ని రోజులు ఆరబోసిందన్న వివరాలను... వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించుకొని రైతు చెప్పిన సమయానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. రెండు రోజులపాటు జిల్లాలో పడ్డ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
జేసీ వెంట వ్యవసాయశాఖ జేడీ లీలావతి, ఏడీ జి.మాణిక్యాంబిక, పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజరు పి.వెంకటరమణ, తహసీల్దారు పి.భాగ్యవతి, ఎంపీడీఓ గ్లాడ్స్, వ్యవసాయాధికారిణి ఆర్.గాయత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: