స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి.. తద్వారా ప్రైవేటీకరణ నిలిపివేయాలని విశాఖ ఉక్కు కార్మిక నేతలు డిమాండ్ చేశారు. అఖిలపక్షం, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 73వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మిక సంఘాల కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి..
రాష్ట్ర అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే చాలదని.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: