నాలుగు సంవత్సరాల్లో విద్య, వైద్యానికి రూ.50 కోట్లు ఖర్చు చేశామని విశాఖ స్టీల్(visaka steel) ప్లాంట్ సీఎండీ కిశోర్ చంద్రదాస్ అన్నారు. జిల్లాలోని వి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాల మరమ్మతులను ఉక్కు పరిశ్రమ చేపట్టిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.15లక్షలు కేటాయించి, పనులు పూర్తి చేశామని సీఎండీ తెలిపారు. నేడు కళాశాలలో భవనాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హాజరయ్యారు.
విద్య, వైద్య సేవలకు సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తున్నామని కిశోర్ చంద్రదాస్ తెలిపారు. జిల్లాలో దివ్యాంగులకు పార్కు నిర్మించినట్లు తెలిపారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరా చేశామని.. మహారాష్ట్రకు ఎక్కువ మొత్తంలో పంపించామన్నారు. మాడుగులను దత్తత తీసుకుని, అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్ సేవలను ఎమ్మెల్యే ముత్యాలనాయుడు కొనియాడారు. అనంతరం సీఎండీ, ఎంపీ, ఎమ్మెల్యేను సన్మానించారు.
ఇదీ చదవండి: Vice President of India: మాతృ భాషను విస్మరించొద్దు: ఉపరాష్ట్రపతి