విశాఖ జిల్లా నాతవరం మండలం మాధవ నగరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబానికి నియోజకవర్గ జనసేన పార్టీ నేతల ఆధ్వర్యంలో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను ఉచితంగా అందజేశారు. గ్రామానికి చెందిన మధ్య నానాజీ అనే జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబానికి జనసేన నేతలు బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ రాజా, సూర్య చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...