దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికులపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శాసన ఉల్లంఘన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విశాఖ జిల్లాలోని ప్రాంతాల్లో ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శంకర్రావు ఆధ్వర్యంలో పాడేరులో కార్యకర్తలు ఆందోళన చేశారు. బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలని లాక్‌డౌన్ కాలంలో పూర్తిస్థాయి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
లాక్‌డాన్ కాలంలో ఆదాయపన్ను లేనివారికి నెలకు రూ 7500, ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నర్సీపట్నంలో సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ కాలంలో విధులు నిర్వహించిన కార్మికులకు వేతనాలు చెల్లించాలని, కరోనా సేవలో ఉన్న ఆరోగ్య పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కింద సహాయం చేయాలని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దు: ముద్రగడ