పాఠశాలలను అభివృద్ధి చేసి మౌళిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం చేపట్టిన నాడ-నేడు జూలై 23 నాటికి పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా చోడవరం మండలంలోని 28 గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.8.50 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. మొదటి విడతగా రూ.1.12 కోట్లతో పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.52.01 లక్షలు వ్యయం చేసినట్లు విద్యాశాఖాధికారి అచ్యుతరావు చెప్పారు.
ఇదీ చూడండి