విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఏన్నిక ఏకగీవ్రమైనట్లుగా తెలుస్తోంది. సర్పంచి స్థానానికి ఒకటి, 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
సర్పంచిగా.. మొల్లి రాజ్యలక్ష్మి ఎన్నిక కావడం దాదాపుగా పూర్తయింది. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.