ETV Bharat / state

గర్భిణికి తప్పని పాట్లు.. డోలీలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు

విశాఖ జిల్లా హుకుంపేట మండలం కిన్నెరలోవ గ్రామంలో ఓ గర్భిణి ప్రసవ వేదనతో తల్లడిల్లింది. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీ కట్టి 4 కిలోమీటర్ల మేర కొండ దిగువకు మోసుకొచ్చారు.

గర్బిణీని డోలీలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు

author img

By

Published : Jun 10, 2021, 3:59 PM IST

గర్బిణీని డోలీలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గర్భిణిల డోలి మోతలు ఆగడంలేదు. హుకుంపేట మండలం తేగలవలస పంచాయతీ కిన్నెరలోవ గ్రామంలో నిన్న రాత్రి ఓ గర్భిణి.... ప్రసవ వేదనతో విలవిల్లాడింది. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో..గ్రామస్థులు డోలీ కట్టి 4 కిలోమీటర్ల మేర కొండ దిగువకు మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో హుకుంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హుకుంపేట ఆసుపత్రిలో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. రహదారి నిర్మాణంలో జాప్యం వల్లే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: దిల్లీ చేరుకున్న సీఎం జగన్​.. కాసేపట్లో కేంద్రమంత్రులతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.